LIVE FM

11/10/2024

Latest Online Breaking News

పెరిగిన కోడిగుడ్డు ధరలు …కోడిగుడ్డు.. @రూ.7 /-

Spread the love

కోడి గుడ్డు ధర 14 రోజల క్రితం వరకు ఒక్కో కోడి గుడ్డు రూ.6 ఉండగా.. ప్రస్తుతం రూ. 7 పలుకుతోంది. హెల్ సేల్ లో ఒక్కో గుడ్డు ధర రూ.5.80 లకు చేరింది.డిమాండ్ భారీగా పెరగడంతోనే కోడి గుడ్డు ధరలు పెరిగినట్లుగా చెబుతున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో ఆహారంలో ఎక్కువగా కోడిగుడ్లు తింటున్నారు. దీంతో కోడి గుడ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. కార్తీకమాసంలో కాస్త తక్కువగా ఉన్న గుడ్ల ధరలు.. కార్తీక మాసం ముగియడంతోనే పెరిగాయి. అలాగే, కోళ్ల దాణా ధరలు రెట్టింపు అవ్వడం కూడా గుడ్ల ధరలు పెరగాడానికి కారణమని చెబుతున్నారు.గతంలో కరోనా టైమ్ లో గుడ్ల వినియోగం పెరిగిందని, ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ప్రచారంతో చాలామంది గుడ్లు తింటున్నారన్నారని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణలోనే కోడిగుడ్ల ఉత్పత్తి ఎక్కువ. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న గుడ్ల లో దాదాపు 50 శాతం ఢిల్లీ, ముంబై సిటీలతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఎగుమతి అవుతున్నాయి. ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా వివరిస్తున్నారు.అటు చికెన్ ధర కూడా పెరిగింది. కార్తీక మాసం సందర్భంలో కిలో చికెన్ రూ. 170 నుంచి రూ.190 పలికితే ఇప్పుడు రూ. 250కు చేరింది. అటు అల్లం, వెల్లుల్లి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సన్న బియ్యం ధరలు పెరగడం కూడా సామాన్యలపై ప్రభావం చూపే అంశంగా పేర్కొంటున్నారు. ధరలు పెరగడంతో ఆహారం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

0
0
,
,