LIVE FM

11/10/2024

Latest Online Breaking News

వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

Spread the love

జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఫర్హానుద్దీన్, డాక్టర్ చందన వారు ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే ను పురస్కరించుకొని పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపుకి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ ఎండీ ఆయాజ్ మరియు హుజురాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ లు హాజరయ్యారు. ఈ హెల్త్ క్యాంప్ నుద్దేశించి, ముఖ్య అతిథులు మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో వృద్ధులలో కాకుండా యువతలో కూడా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతుంది అన్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి తో కూడిన జీవితం ఇందుకు ప్రధాన కారణాలు అన్నారు. గుండె జబ్బుల నుండి రక్షింపబడాలంటే రెగ్యులర్ వ్యాయామం, సమతుల్య ఆహారం,ఒత్తిడిని తగ్గించడం, జీవనశైలిని మెరుగుపర్చుకోవడం మరియు ఆరోగ్య తనిఖీలు చేసికోడం అని పారిశుధ్య కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ వైద్య ఆరోగ్య శిబిరంలో 72మంది పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు .ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమములో భాగంగా పారిశుధ్య కార్మికులకు డాక్టర్ ఫర్హానుద్దీన్, డాక్టర్ చందన, హెల్త్ ఎడ్యుకేటర్ మెహన్ రెడ్డి సీజనల్ వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధుల లక్షణాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించారు. పట్టణ మరియు గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణ లో పారిశుధ్య కార్మికుల పాత్ర వెలకట్టలేనిది అన్నారు. కార్మికులు వ్యక్తి గత పరిశుభ్రత తప్పక పాటించాలన్నారు. విధి నిర్వహణలో గ్లౌజులు మరియు బూట్లు తప్పకున్నాడా వాడాలని సూచించారు. అంబర్, గుట్కా, చుట్ట, బీడీ, మత్తు పదార్తాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కార్మికులకు సూచించారు. వీటి వల్ల క్యాన్సర్, లివర్ జబ్బులు వస్తాయి అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్నారు. చేతుల పరిశుభ్రత గురించి వివరించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ బాధ్యతా యూతంగా పాటించాలన్నారు. హెచ్ఐవి & ఎయిడ్స్ గురించి ఐ సి టి సి &ఐ ఆర్ డీ సి కౌన్సిలర్ బి బబిత పారిశుధ్య కార్మికులకు అవగాహన కల్పించారు .ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ ఎం డి ఆయాజ్, కౌన్సిలర్ ఆర్ రాజకుమార్, మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్స్ అరుణ, రత్నకుమారి, మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ పి మహేష్, హెల్త్ అసిస్టెంట్ నరందర్, రామక్రిష్ణ ల్యాబ్ టెక్నీషియన్, సాయికుమార్ స్టాఫ్ నర్స్ మరియ ఏఎన్ఎం లు మంజుల, వనజ, రాధ, ఆశాకార్యకర్తలు మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

 

1
0
,
,