LIVE FM

11/10/2024

Latest Online Breaking News

ప్రజా పోరాటాల ను ఉదృతం చేయాలి :యంసిపిఐ (యు) జిల్లా రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

Spread the love

 

  • ప్రజా పోరాటాల ను ఉదృతం చేయాలి
  • కష్ట జీవుల రాజ్యం లోనే సమస్యలకు పరిష్కారం
  • యంసిపిఐ (యు) కరీంనగర్ జిల్లా విస్తృత సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపు

యంసిపిఐ(యు) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ తుమ్మల కృష్ణారెడ్డి అధ్యక్షతన సోమవారం రోజున కరీంనగర్ లో ఒక ప్రైవేటు కళాశాలలో జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన యంసిపిఐ (యు) పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ కేంద్రం లో మూడొవ సారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం పూర్తి మెజార్టీ లేక పోయినా అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలపై అధిక భారాలు వేయటం, ప్రైవేటీకరణ వేగం పెంచటం సంపద కొద్ది మంది వ్యక్తుల దగ్గర పోగు చేయటం, దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరగటం దినం దినం విపక్ష పార్టీలపై ఈడి, సిబిఐ, దాడులు పెంచటం, న్యాయ వ్యవస్థలో నిత్యం జోక్యం చేసుకుని రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తు రాష్ట్రాల హక్కులను హరించే చర్యలకు పూనుకోవడం లో భాగంగా వన్ నేషన్, వన్ ఎలక్షన్ పేరుతో జమిలి ఎన్నికలు తీసుకుని రావటానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తీరు భారత రాజ్యాంగ లౌకిక, వ్యవస్తను నిర్వీర్యం చేస్తుంది అని, రాష్ట్రంలో 9 నెలల క్రింద అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన వాగ్దానాలను అమలు చేయకుండా పక్క దారి పట్టించే చర్యలకు పూనుకోవడం జరుగుతుంది అని ఈ విధానానికి వ్యతిరేకంగా కష్టజీవులు అంతా ఏకం బడుగు బలహీన వర్గాల రాజ్యం సాధించినప్పుడే ఈ దోపిడీ అసమానతలు తొలుగుతాయి అని అందుకు యంసిపిఐ (యు) ప్రజా ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం కామ్రేడ్ తుమ్మల క్రిష్ణా రెడ్డి ని ఉమ్మడి జిల్లా యంసిపిఐ(యు) కార్యదర్శిగా ఎన్నికయ్యారు.సభ్యులు గా కామ్రేడ్ కొండా దినేష్, వలిపి రెడ్డి సరోజ, ఖాజా అజిమొద్దీన్, గడ్డం శ్రీ కాంత్, ముదాం రవీందర్,లక్ష్మన్ , తదితరులను ఎన్నుకోవటం జరిగింది.

అక్టోబర్ 20 వ తేదీన కరీంనగర్ లో యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ 16 వ వర్ధంతి సభ ను పెద్ద ఎత్తున కరీంనగర్ లో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.

ఈ సమావేశం లో యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం నాగార్జున,కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తుమ్మల కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు కొండా దినేష్ ,ఖాజా అజిమొద్దీన్, వలపి రెడ్డి సరోజ, వలపి రెడ్డి లక్ష్మి, ముదాం రవీందర్, బాలయ్య, గడ్డం శ్రీ కాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

0
0
,
,