Latest Online Breaking News

పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

Spread the love

జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామములోని ఖాది బండార్ కార్యాలయంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమములో భాగంగా శుక్రవారం రోజున  జమ్మికుంట రూరల్ గ్రామాలలోని పారిశుధ్య కార్మికులకు డాక్టర్ కార్తీక్ , డాక్టర్ విజయ్ కుమార్ లు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 53 మంది పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.  పారిశుధ్య కార్మికుల హెల్త్ ప్రొఫైల్ హెల్త్ కార్డ్స్ లో నమోదు చేశారు .ఆరోగ్య సమస్యలు ఉన్న 3 గురు కార్మికులను ఆరోగ్య పరీక్షల నిమిత్తం జిల్లా హాస్పిటల్ కి రెఫెరల్ చేశారు. వ్యక్తి గత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల గురించి మరియు డ్యూటీ పరంగా వారు తీసుకోవలసిన జాగ్రత్తలను క్లుప్తంగా వివరించారు.  ఆరోగ్య సంరక్షణ కొరకు గ్లౌజ్ లు మరియు భూట్లు తప్పకుండా ధరించాలని సూచించారు.పొగాకు, అంబర్, గుట్కాలకు మరియు మత్తు పదార్తలకు దూరం గా ఉండి ఆరోగ్యమును కాపాడుకోవాలని కార్మికులకు సూచించారు.  ఆరోగ్య సమస్యలు ఉన్న కార్మికులకు బ్లడ్ సాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించారు. ఈ కార్యక్రమములో యూనిసెఫ్ డైరెక్టర్ కిషన్, ఎంపీడీఓ భీమేష్ , ఎంపీఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ  డాక్టర్ చందు , స్పెషల్ ఆఫీసర్ నవీన్, హెల్త్ ఎడ్యుకేటర్స్ మోహన్ రెడ్డి, ప్రతాప్, ఖాదీ డైరెక్టర్ శ్రీనివాస్, డి ఎల్ పి ఓ  శ్రీనివాస్, డాక్టర్స్ కార్తీక్, విజయ్ కుమార్, సీడీపీఓ సుగుణ, సూపర్ వైజర్స్ సదానందం, కుసుమ కుమారి, పద్మ, ల్యాబ్ టెక్నీషియన్ రామక్రిష్ణ, సాయికుమార్ స్టాఫ్ నర్స్, ఏఎన్ఎంలు రమ, హైమవతి, తిరుమల, ఆషాలు తదితరులు పాల్గొన్నారు.

0
0
,
,
Exit mobile version